తెలంగాణ

telangana

ETV Bharat / international

పట్టాలు తప్పిన ప్యాసింజర్​ రైలు.. ముగ్గురు మృతి - britain latest news

స్కాట్లాండ్​లో వరద ప్రభావిత ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్​ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో లోకోపైలట్​ కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

SCOTLAND-TRAIN-DERAILMENT
పట్టాలు తప్పిన ప్యాసెంజర్​ రైలు

By

Published : Aug 13, 2020, 7:16 AM IST

స్కాట్లాండ్​ స్టోన్​హెవెన్​లో ఓ ప్యాసింజర్​ రైలు పట్టాలు తప్పింది. ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురికి గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా స్కాట్లాండ్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతంలో రైలు ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరణించిన వారిలో రైలు లోకోపైలట్​ కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పట్టాలు తప్పిన ప్యాసింజర్​ రైలు

ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తునట్లు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: సౌదీ- పాక్‌ మైత్రికి బీటలు..కశ్మీర్‌ అంశమే కారణం!

ABOUT THE AUTHOR

...view details