తెలంగాణ

telangana

ETV Bharat / international

సీఏఏ వ్యతిరేక తీర్మానాలపై 'ఈయూ'లో చర్చ.. మార్చిలో ఓటింగ్​

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానాలపై ఐరోపా సమాఖ్యలో చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన ఈయూ కమిషన్ వైస్‌ ప్రెసిడెంట్ హెలెనా.. భారత రాజ్యాంగానికి లోబడి చట్టం ఉందా అని పరిశీలించాల్సింది ఆ దేశ సుప్రీంకోర్టు అని అభిప్రాయపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలపై మార్చిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.

European Parliament
సీఏఏ వ్యతిరేక తీర్మానాలపై ఈయూలో చర్చ

By

Published : Jan 30, 2020, 8:08 AM IST

Updated : Feb 28, 2020, 11:50 AM IST

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్‌ సభ్యులు చేసిన తీర్మానాలపై ఐరోపా సమాఖ్యలో చర్చ జరిగింది. బ్రస్సెల్స్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో సీఏఏపై చేసిన ఐదు తీర్మానాలకు కలిపి సంయుక్త తీర్మానంగా ప్రవేశపెట్టారు. చర్చను ప్రారంభించిన ఈయూ కమిషన్ వైస్‌ ప్రెసిడెంట్ హెలెనా.. భారత రాజ్యాంగానికి లోబడి చట్టం ఉందా అని పరిశీలించాల్సింది ఆ దేశ సుప్రీంకోర్టు అని అభిప్రాయపడ్డారు.

దేశంలో గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఆందోళనలను సద్దుమణిగించేందుకు ప్రస్తుతం జరుగుతున్న న్యాయ ప్రక్రియ దోహదపడుతుందని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.... సీఏఏకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలపై మార్చిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. సీఏఏపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారిస్తుండటమే ఓటింగ్ వాయిదాకు కారణమని తెలుస్తోంది..

ఇదీ చూడండి: పౌరసత్వ సవరణ చట్టంపై ఈయూ పార్లమెంట్​లో తీర్మానం

Last Updated : Feb 28, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details