ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనెకా టీకాకు, రక్తం గడ్డకట్టడానికి ఎలాంటి సంబంధం లేదని తమ పరిశోధనలో తేలిందని వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేసిన ఈయూ దేశాలు.. తిరిగి ప్రారంభించాలని సూచించింది.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ తీసుకునే నిర్ణయం కోసమే తాము ఆగినట్లు జర్మనీ, ఫ్రాన్స్ తెలిపాయి.
"మా సాంకేతికత ప్రకారం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితమైనది. కరోనాపై ఈ టీకా సమర్థంగా పనిచేస్తుంది. నేనే గనుక ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకుంటే.. రేపే తీసుకుంటాను."