దిల్లీలోని యుద్ధ స్మారకం ఇండియా గేట్ వద్ద విద్యుత్ దీపాలను ఆర్పివేశారు. ప్యారిస్ అంతా వెలుగులు నింపే ఐఫిల్ టవర్ గంటపాటు వెలవెలబోయింది. భూతాపానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది తైవాన్‌లోని తైపీ101 ఆకాశహర్మ్యం.
ఇంధన సంరక్షణ, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా 2007లో ఆస్ట్రేలియా సిడ్నీలో ప్రారంభమైంది 'ఎర్త్ అవర్'. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలు అదే బాటలో నడుస్తున్నాయి. కోట్ల మంది ప్రజలు స్వతహాగా విద్యుత్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.