తెలంగాణ

telangana

ETV Bharat / international

లాక్​డౌన్​లో పెరిగిన గృహ హింస ఫిర్యాదులు

ఐరోపాలో లాక్​డౌన్ వేళ గృహహింస ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా ప్రతినిధి హన్స్​ తెలిపారు. ఈ ఫిర్యాదులు బెల్జియం, బ్రిటన్​, ఫ్రాన్స్​, రష్యా, స్పెయిన్​ దేశాల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.

Domestic violence reports trouble WHO in Europe
లాక్​డౌన్​లో పెరిగిన గృహ హింస ఫిర్యాదులు

By

Published : May 7, 2020, 5:50 PM IST

కరోనా కట్టడికి ఐరోపా మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన వేళ గృహహింస ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా ప్రతినిధి తెలిపారు. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరిపై ఇంట్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.

బెల్జియం, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, స్పెయిన్‌ నుంచి ఈ ఫిర్యాదులు ఎక్కువగా నమోదైనట్లు వివరించారు. ఐరోపా వ్యాప్తంగా ఉన్న 60 శాతం మహిళలు ఈ లాక్‌డౌన్‌లో గృహహింసకు గురైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయన్న హన్స్ క్లూగ్‌.. గతంలో కంటే సాయం కోసం హెల్ప్‌లైన్లకు వచ్చే కాల్స్ ఐదు రెట్లుపెరిగాయని తెలిపారు.

కొవిడ్‌-19 కట్టడి కోసం తీసుకొచ్చిన ఆంక్షలు.. ఇళ్లల్లో ఉన్న చిన్నారులు, మహిళలపై తీవ్ర ప్రభావం చూపాయని క్లూగ్ చెప్పారు. ఒక వేళ మరో ఆరు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ లాక్‌డౌన్ కొనసాగితే.. దాదాపు మూడున్నర కోట్ల వరకూ లింగవివక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వాలు గృహహింసకు గురవుతున్న వారిపట్ల మానవతాదృక్పథంతో స్పందిస్తూ వారికి సాయం చేయాలని క్లూగ్ సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details