స్పెయిన్లో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆ దేశంలో వైరస్ కారణంగా కేవలం 24 గంటల్లోనే 738 మంది మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 3 వేల 434కు చేరింది. వైరస్ కేంద్ర బిందువైన చైనాలో సంభవించిన(3,281) మరణాలకన్నా ఇది ఎక్కువ.
స్పెయిన్లో ఇప్పటివరకు 47 వేల 610మంది వైరస్ బారిన పడ్డారు. దేశమంతా 11 రోజులుగా లాక్డౌన్లో ఉన్నప్పటికీ దేశంలో మరణాలు 27 శాతం పెరిగినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది.