తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరోపాలో వరదలకు 150మంది బలి - బెల్జియంలో వరదలు

జర్మనీ, బెల్జియంలో వరదల ధాటికి మృతిచెందినవారి సంఖ్య 150కి పెరిగింది. గల్లంతైన వందలాది మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహానికి అనేక ఇళ్లు కూలిపోయాయి. కార్లు, ఇతర వాహనాలు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి.

Europe floods
వరదలు

By

Published : Jul 17, 2021, 5:29 PM IST

ఐరోపాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. జర్మనీ, బెల్జియం​లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 150కి పెరిగింది. వర్షాల బీభత్సానికి వందలాది మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని రైన్​లాండ్, పలాటినేట్​ ప్రాంతాల్లోనే వరదల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నార్త్​ రైన్- వెస్ట్​ ఫాలియా రాష్ట్రంలో మృతుల సంఖ్య 43కు చేరింది. బెల్జియంలో 27 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. కొట్టుకుపోయి పడి ఉన్న కార్లు, ట్రక్కుల్లో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

జర్మనీలోని ఈర్ఫ్​స్టాడ్​ ప్రాంతంలో మిలిటరీ సహయక చర్యలు కొనసాగిస్తోంది. వరద ముంపులో కూరుకుపోయిన కార్లను వెలికితీస్తున్నారు.

సహాయక చర్యల్లో మిలిటరీ

బెల్జియంలో మియూస్​​ రివర్​ ఉద్ధృతితో లీగెలోని బ్రిడ్జ్​ ఇలా ప్రవాహంలో మునిగిపోయింది. రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతింది.

వరదల్లో మునిగిపోయిన బ్రిడ్జ్

బెల్జియం పిపినస్టర్​ ప్రాంతంలో జలమయమైన కాలనీల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో కొట్టుకువచ్చిన వ్యర్థాలను యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు.

వ్యర్థాలను తొలగిస్తున్న సిబ్బంది

మరోవైపు ముంపు ప్రాంతం నుంచి పునరావాస ప్రాంతాని జనం తరలివెళ్తున్నారు. నీట మునిగిన కాలనీ నుంచి ఓ వ్యక్తి ఇలా బయటకు వెళ్తున్నారు.

నీట మునిగిన కాలనీ నుంచి బయటకు వస్తున్న వ్యక్తి

బెల్జియంలోని లీగె పట్టణంలో మియూర్​ రివర్ వరదల్లో కారు ఇలా కొట్టుకుపోతోంది. వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది.

వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న కారు

వరదల ఉద్ధృతితో జనావాసాలు నీట మునిగాయి. బెల్జియంలోని పిపిన్​స్టర్​లో చుట్టూ వరద ప్రవాహంలో ఇళ్లు ఇలా దర్శనమిచ్చాయి.

నీట మునిగిన ఇళ్లు

బెల్జియంలో మెయూస్​ రివర్​ ఉప్పంగగా.. లీగె పట్టణ ప్రజలు ఇలా రబ్బర్​ బోట్లను ఉపయోగించుకుని బయటకు వస్తున్నారు.

రబ్బరు బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలు

ఇదీ చదవండి:ముంచెత్తిన వరద- 110 మంది బలి

ABOUT THE AUTHOR

...view details