తెలంగాణ

telangana

ETV Bharat / international

లండన్​ బాబుకు వెండి మొలతాడు, హనుమాన్​ లాకెట్ - డబ్బావాలా

ముంబయిలోని డబ్బావాలాలు... బ్రిటిష్​ రాజకుటుంబ వారసుడికి ప్రత్యేక కానుక పంపేందుకు సిద్ధమయ్యారు. కాలి పట్టీలు, వెండి మొలతాడు, హనుమంతుడి లాకెట్​ను బుల్లి యువరాజుకు అందించనున్నారు.

లండన్​ బాబుకు వెండి మొలతాడు, హనుమాన్​ లాకెట్

By

Published : May 12, 2019, 7:29 PM IST

Updated : May 12, 2019, 7:36 PM IST

లండన్​ బాబుకు వెండి మొలతాడు, హనుమాన్​ లాకెట్

బ్రిటిష్​ యువరాజు హ్యారీ- యువరాణి మేఘన్​ మార్కెల్​ దంపతుల కుమారుడికి ప్రత్యేక కానుకను పంపనున్నారు ముంబయి డబ్బావాలాలు. బ్రిటిష్ రాజకుటుంబ వారసుడి కోసం కాలి పట్టీలు, వెండి మొలతాడు కానుకగా ఇవ్వనున్నారు. హనుమంతుడి విగ్రహంతో కూడిన నెక్లెస్​నూ పంపనున్నట్లు డబ్బావాలాల సంఘం అధ్యక్షుడు సుభాష్​ తాలేకర్​ తెలిపారు.

వీరి బంధం 2003 నుంచే...

బ్రిటిష్​ రాజకుటుంబంతో ముంబయి డబ్బావాలాలకు మంచి అనుబంధమే ఉంది. 2003లో వేల్స్​ యువరాజు ఛార్లెస్..​ ముంబయిలోని డబ్బావాలాలను కలిశారు. వారి పనిని చూసి ముగ్ధులయ్యారు. ఈ పర్యటనతో బ్రిటిష్​ రాజకుటుంబీకులు- డబ్బావాలాల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

2005లో ఛార్లెస్​-కామిల్లాల వివాహానికి డబ్బావాలాలకు ఆహ్వానం అందింది. ఫలితంగా వీరి అనుబంధం మరింత గట్టిపడింది. వీరందరి ప్రయాణ ఖర్చులు రాజకుటుంబమే భరించి బ్రిటన్​లో​ జరిగిన పెళ్లికి సాదర స్వాగతం పలికింది.

2018 మే 19న జరిగిన బ్రిటిష్​ యువరాజు హ్యారీ, హాలీవుడ్​ నటి మేఘన్​ మార్కెల్​ల విహహ వేడుకలనూ ఘనంగా నిర్వహించారు డబ్బావాలాలు. వధూవరులిద్దరికీ సంప్రదాయ మరాఠీ దుస్తులను పెళ్లి కానుకగా అందజేశారు. ఇప్పుడు వారి కుమారుడికి బహుమానం పంపుతున్నారు.

ఈ డబ్బావాలాలు ఎవరు?

ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఇంటి నుంచో, రెస్టారెంట్ల నుంచో మధ్యాహ్న భోజనం బాక్స్​ అందజేసి... ఖాళీ బాక్సులను తిరిగి ఇంటికి ఇచ్చేవారే డబ్బావాలాలు. ఈ భోజన బాక్సులను సైకిళ్లపై గానీ, లోకల్​ రైళ్లలో గానీ తీసుకెళ్లి ఉద్యోగులకు అందజేస్తారు. వీరి జీవతకథ ఆధారంగానే 2013లో 'ద లంచ్​ బాక్స్'​ అనే బాలీవుడ్ చిత్రం తెరకెక్కింది.

ఇదీ చూడండి : 'అసలే బాధలో ఉన్నాం.. మీరూ బాధపెట్టకండి'

Last Updated : May 12, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details