కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే రేసులో ముందంజలో ఉంది బ్రిటన్. ఆక్స్ఫర్డ్వర్సిటీ, బ్రిటిష్ స్వేడిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తోన్న కరోనా వ్యాక్సిన్ మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా.. యూకేలోని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ తొలి డోసు అందుతుందని ఓ నివేదిక తెలిపింది.
ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ .. వేగంగా ప్రయోగాలు పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడాదిలోనే అధికారిక ధ్రువీకరణతో వ్యాక్సిన్ విడుదల కానుందని.. కేవలం ఆరు నెలల్లోనే ప్రపంచంలోని ప్రతి పౌరుడికి ఓ డోసు అందుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.