తెలంగాణ

telangana

వృద్ధుల్లోనూ ఆక్స్​ఫర్డ్​ టీకా ఆశాజనక ఫలితాలు!

ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్​ఫర్డ్ తయారు చేస్తోన్న టీకా వృద్ధుల్లోనూ రోగనిరోధక శక్తిని పెంచుతోందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్.. పరిశోధనల సమాచారాన్ని పీర్​-రివ్యూడ్​ జర్నల్​లోప్రచురించేందుకు సమర్పించారు.

By

Published : Oct 27, 2020, 10:58 PM IST

Published : Oct 27, 2020, 10:58 PM IST

COVID-19 vaccine shows strong immune response' in all adult groups: Oxford University
వయోజనుల్లో మంచి ఫలితాల్నిస్తున్న ఆక్స్​ఫర్డ్​ టీకా

కొవిడ్​ వ్యాక్సిన్​ తయారీలో ముందున్న ఆక్స్​ఫర్డ్​.. తాము అభివృద్ధి చేస్తున్న టీకా వృద్ధుల్లోనూ ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపింది. 56 నుంచి 69, 70 ఏళ్ల పైబడిన వారిపై చేసిన క్లినికల్​ ట్రయల్స్​లో వచ్చిన ఫలితాలను ఓ జర్నల్​లో ప్రచురించేదుకు ఆక్స్​ఫర్డ్​ పరిశోధకులు సమర్పించారు.

మా క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించిన సమాచారం ఆశాజనకంగా ఉంది. వయోజనులపై జరిపిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలతో మరో మైలురాయిని అధిగమించాము.

-ఆండ్రూ పొలార్డ్, ఆక్స్​ఫర్డ్ యూనిర్సిటీ ప్రొఫెసర్

చివరి దశ ఫలితాలు సానుకూలంగా వస్తే ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: హ్యూమన్​ ట్రయల్స్​లో ఆక్స్‌ఫర్డ్ టీకా ఫలితాలు ఆశాజనకం

ABOUT THE AUTHOR

...view details