తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు - బ్రిటన్​

బ్రిటన్​ పార్లమెంట్​ సమావేశాలను అక్టోబర్​ 14 వరకు రద్దు చేయడాన్నిఆ దేశ విపక్షాలు తప్పుపట్టాయి. ప్రధాని బోరిస్​ జాన్స్​న్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అత్యవసర విచారణ చేపట్టి సమావేశాలు జరిగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరాయి.

బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు

By

Published : Aug 30, 2019, 5:47 AM IST

Updated : Sep 28, 2019, 7:58 PM IST

బ్రిటన్​ పార్లమెంట్ సమావేశాల రద్దుపై కోర్టుకు విపక్షాలు
బ్రిటన్​ పార్లమెంట్​ సమావేశాల రద్దుకు వ్యతిరేకంగా కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. యూరోపియన్​ అనుకూలవాదులు, ఒప్పందం లేని బ్రెగ్జిట్​ను వ్యతిరేకిస్తున్న ఎంపీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాని నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సమావేశాల రద్దు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించాయి.

లండన్​, ఎడిన్​బర్గ్​, బెల్పాస్టల్​లోని కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు ఎంపీలు. 75 మంది ఎంపీలు సమావేశాల రద్దును నిలిపివేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని స్కాట్లాండ్​లోని అత్యున్నత సివిల్​ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

బుధవారం అందరిని ఆశ్చర్యపరుస్తూ.. అక్టోబర్​ 14 వరకు పార్లమెంట్​ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రకటించారు. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు సరికొత్త శాసన అంజెండాను రూపొందించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఎలిజబెత్​ రాణి-2 ఆమోద ముద్ర వేశారు.

నిరసనలు..

సమావేశాల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా లండన్​, మాంచెస్టర్​, ఎడిన్​బర్గ్​ ప్రాంతాల్లో వేల మంది నిరసనలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1.4 మిలియన్ల సంతకాలతో ఆన్​లైన్​ పిటిషన్​ దాఖలు చేశారు. శనివారం మరిన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేప్టటాలని ప్రతిపక్ష లేబర్​ పార్టీ పిలుపునిచ్చింది.

పార్లమెంట్​ సమావేశాల రద్దును ఆర్చ్​-బ్రెక్సైటర్​ మంత్రి జాకబ్​ రీస్​-మోగ్​ సమర్థించారు. అక్టోబర్​ 31కి ముందే బ్రెగ్జిట్​పై చర్చించడానికి ఎంపీలకు సమయం ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి:పార్లమెంటు సమావేశాల రద్దుకు బ్రిటన్​ రాణి​ ఆమోదం

Last Updated : Sep 28, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details