తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విలయం: ఆ దేశాల్లో రికార్డు స్థాయి కేసులు - ప్రపంచంలో కరోనా విజృంభణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు 13 కోట్ల 45లక్షలమందికిపైగా వైరస్ బారిన పడ్డారు. 29లక్షల మందికిపైగా మహమ్మారి కారణంగా బలయ్యారు. గురువారం కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.

Countries worldwide hit new records for virus cases, deaths
కరోనా విలయం: ఆ దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు

By

Published : Apr 9, 2021, 8:12 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. గురువారం కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 13 కోట్ల 45 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు.

మొత్తం కేసులు: 13,45,08,532

మొత్తం మరణాలు: 29,14,774

కోలుకున్న వారు: 10,83,04,112

యాక్టివ్​ కేసులు: 2,32,89,646

  • అమెరికాలోని మిషిగాన్​ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రోజుకు 7వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
  • మసాచుసెట్స్​లోనూ వరుసగా ఏడు రోజులనుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 2,100 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
  • అమెరికా, పెరూ తర్వాత.. ఒక్కరోజులో కొవిడ్​ మరణాలు 4 వేలు దాటిన దేశంగా బ్రెజిల్​ నిలిచింది.
  • ఇరాన్​లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22వేల 600 మంది కరోనా బారినపడ్డారు.
  • 21 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్​లో.. దాదాపు 3 శాతం( 63 లక్షలు) మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు.
  • దక్షిణ కొరియాలో గురువారం 700కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 5 తర్వాత ఇదే అత్యధికం. ఈ దేశంలో కఠిన ఆంక్షలు విధించే అవకాశముంది.

ఇదీ చదవండి :అమెరికాలో కాల్పుల కలకలం- ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details