వాతావరణ మార్పుల కారణంగానే.. 2002లో వచ్చిన సార్స్ కొవిడ్ వైరస్ మార్పులకు లోనై.. ప్రస్తుత కరోనా వైరస్‌గా రూపాంతరం చెందినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాల్‌మెంట్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టింది.
2002లో వచ్చిన సార్స్ ఇప్పుడు కరోనాగా మారింది! - సార్స్ కొవిడ్ వైరస్
వాతావరణ మార్పుల కారణంగానే 2002లో వచ్చిన సార్స్‌కొవిడ్ వైరస్ ప్రస్తుత కరోనా వైరస్‌గా రూపాంతరం చెందిందని లండన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలాల నుంచే కరోనా వైరస్ వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్న తరుణంలో వాతావరణంలో కలుస్తోన్న గ్రీన్ హౌస్ వాయువులు గబ్బిలాల జాతులను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్స్, మయన్మార్, లావోస్ దేశాల్లోని ప్రాంతాలు గబ్బిలాల జాతుల మార్పులకు కేంద్ర బిందువులుగా ఉన్నట్లు చెప్పారు.
వాతావరణంలో కలుస్తున్న గ్రీన్ హౌస్ వాయువులు గబ్బిలాల జాతులను ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సార్స్‌కొవిడ్-1, సార్స్ కొవిడ్-2 వైరస్‌ల మూలాలు ఒకే విధంగా ఉన్నట్లు లండన్‌కి చెందిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్ర్తవేత్తలు గుర్తించారు. దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్స్, మయన్మార్, లావోస్ దేశాల్లో గబ్బిలాల జాతులు గొప్ప మార్పులకు లోనయ్యాయన్న నిపుణులు.. ప్రపంచంలోనే ఆయా ప్రాంతాలు కేంద్ర బిందువులుగా ఉన్నట్లు చెప్పారు. గబ్బిలాల జాతులు వాతావరణ ప్రభావానికి లోనవుతున్నాయన్న పరిశోధకులు.. కొన్ని ప్రాంతాల్లో గబ్బిలాల జాతులు అంతరించి పోతుంటే మరికొన్ని ప్రదేశాల్లో విస్తరించేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.వాతావరణ మార్పుల కారణంగా మయన్మార్, లావోస్‌లోని కొన్ని ప్రాంతాల్ సుమారు 40 కొత్త గబ్బిలాల జాతులు పుట్టుకు వచ్చాయని అధ్యయనం పేర్కొంది.
ఇదీ చూడండి:'అమెరికాను బలహీనం చేయడమే చైనా లక్ష్యం'