అంతర్జాతీయ స్థాయి ఆటోమొబైల్ ప్రదర్శన స్విట్జర్లాండ్‌లోని జెనివాలో జరగనుంది. మార్చి 4 నుంచి 17వ తేదీ వరకు దీన్ని నిర్వహించనున్నారు. సోమవారం ప్రారంభ ప్రదర్శనలోనే అత్యుత్తమ కారును ప్రకటిస్తారు. గతేడాది వోల్వో ఎక్స్‌సీ 40 విజేతగా నిలిచింది. ఈ ఏడాది పోటీల్లో అల్పైన్ ఏ110, సిట్రాయిన్ సీ5 ఎయిర్‌క్రాస్, ఫోర్డ్ ఫోకస్, జాగ్వార్ ఐ-పేస్, కియా క్రీడ్, మెర్సెడెస్ బెంజ్ ఏ క్లాస్, ఫ్యుజెట్ 508 అవార్డుకు నామినేట్ అయ్యాయి.
జాగ్వార్ లాండ్ రోవర్ సైతం ఈ ఏడాది ప్రదర్శనలో పాలు పంచుకోనుంది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు రావడం, చైనాలో జాగ్వార్ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయిన కారణంగా 4500 ఉద్యోగులను తొలగించనున్నామని గతంలో ప్రకటించింది జాగ్వార్. పోటీల్లో తమ కారును ఉంచేందుకు లాండ్ రోవర్‌ను సైతం ప్రదర్శనకు పంపింది.