బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసామే ప్రతిపాదిస్తున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటు మూడోసారి తిరస్కరించింది. నాలుగు ప్రత్యామ్నాయ ప్రణాళికలకు కూడా ఆమోదం లభించలేదు.
ఐరోపా సమాఖ్యను వీడిన అనంతరం కూడా ఆర్థిక సంబంధాలు కొనసాగించటం, రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, ఒప్పందం లేకుండా ఈయూ నుంచి తప్పుకోవటాన్ని ఆపేందుకు బ్రెగ్జిట్‌ను నిలిపివేయటం లాంటివి ఈ ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి.
రెండో ప్రజాభిప్రాయ సేకరణకు 280 మంది అంగీకరించగా 292 మంది తిరస్కరించారు. కస్టమ్స్ సమాఖ్యలో కొనసాగాలన్న దానికి 273 మంది సమ్మతం తెలపగా... 276 మంది అంగీకరించలేదు.