బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, సైమండ్స్ ఇద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జాన్సన్. పుట్టబోయే బిడ్డకు డైపర్స్ మారుస్తారా అని అడిగన ప్రశ్నకు సిగ్గుతో తడబడ్డారు ప్రధాని.
అయితే తాను ఆ పని చేయనని జాన్సన్ అన్నారు. మళ్లీ తండ్రి కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న తన పిల్లలు ఈ వార్తకు ఎలా స్పందించారో చెప్పేందుకు జాన్సన్ నిరాకరించారు.
ఇంటర్వ్యూ సాగిందిలా...
ప్ర:మీకు పుట్టబోయే బిడ్డకు డైపర్లు మార్చటంపై ఎలా ఫీల్ అవుతున్నారు?
జ: నేను ఆ పని చేయను. నిజంగా నేను అలా చేయను.
ప్ర: మీరు అలా చేయరు అంతేనా?