తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​, కెనడాలోనూ మోదీ చెప్పినట్లే చేసిన ప్రజలు

కరోనాతో ప్రతిక్షణం పోరాడుతున్నారు వైద్యులు. జనాలను కాపాడేందుకు వారి ప్రాణాలు ఫణంగా పెడుతున్న వైద్య సిబ్బందికి బ్రిటన్​, కెనడాలో ప్రజలంతా కృతజ్ఞతలు తెలిపారు. వీధులన్నీ మారుమోగేలా చప్పట్లు కొట్టి వారి సేవలను ప్రశంసించారు.

britain and canada residents thanked healthcare workers and first responders by cheering and clapping from their properties amid the coronavirus pandemic.
వీధుల్లో మారుమోగిన చప్పట్లు.. కారణం ఇదే..

By

Published : Mar 27, 2020, 1:01 PM IST

Updated : Mar 27, 2020, 9:03 PM IST

బ్రిటన్​, కెనడాలోనూ మోదీ చెప్పినట్లే చేసిన ప్రజలు

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తున్నాయి. అయితే, యుద్ధభూమిలో ప్రత్యక్షంగా పోరాడుతున్న సైనికులు మాత్రం వైద్య బృందాలే. కొవిడ్​-19కు ఎదురెళ్లి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న వైద్యుల తెగువకు సలాం చేశారు బ్రిటన్​, కెనడా ప్రజలు. చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.

బ్రిటన్​​ జాతీయ ఆరోగ్య సేవ సంస్థను సూచించేలా.. లండన్ నగరమంతా నీలి రంగు దీపకాంతులతో వెలిగిపోయాయి. ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఇంటి బయటకొచ్చి చప్పట్లతో వైద్యుల సేవలను ప్రశంసించారు.

కెనడాలోనూ ప్రజలంతా నిర్బంధ నియమాలు పాటిస్తూనే.. వాకిట్లోకి వచ్చి, కిటికీల్లో నుంచి కరతాళధ్వనులతో వైద్య రంగానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటివరకు కెనడాలో 4000 కరోనా కేసులు నమోదు కాగా, 38 మంది మృతి చెందారు. లండన్​లో వైరస్​ బారినపడి 578 మంది బలయ్యారు.

ఇదీ చదవండి:కరోనా వైద్యుల పాటకు నెటిజన్లు ఫిదా

Last Updated : Mar 27, 2020, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details