బ్రెగ్జిట్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎంపీల అనుమతి లేకుండా బ్రెగ్జిట్ బిల్లుపై ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండేలా బ్రిటన్ పార్లమెంటులో ఓటింగ్ జరిగింది. మొత్తం 329 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా 302 మంది ఈ నిర్ణయాన్ని సమర్థించారు.
వీలైనంత త్వరగా ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయేందుకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే పావులు కదుపుతున్నారు. ఇందుకు సొంత పార్టీ ఎంపీలే అడ్డుతగులుతున్నారు. తాజాగా మరోసారి బ్రెగ్జిట్ విషయంలో ప్రధానికి భంగపాటు తప్పలేదు.
బ్రెగ్జిట్‌పై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బ్రిటన్‌లో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు.