తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​... ముగింపు కాదు ఆరంభం: బోరిస్ జాన్సన్​ - యూరోపియన్ యూనియన్​

'బ్రెగ్జిట్​ ఓ నూతన శకానికి నాంది' అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. జనవరి 31 రాత్రి 11 గంటల తర్వాత అధికారికంగా ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయూతో స్నేహపూర్వక సహకార, సంబంధాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Brexit heralds new beginning, new ties with EU: Johnson
బ్రెగ్జిట్​... ముగింపు కాదు ఆరంభం: బోరిస్ జాన్సన్​

By

Published : Feb 1, 2020, 6:13 AM IST

Updated : Feb 28, 2020, 5:55 PM IST

ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ అధికారికంగా వైదొలగడాన్ని ఓ నూతన శకానికి నాందిగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్​ అభివర్ణించారు. ఈయూతో స్నేహపూర్వక సహకార, సంబంధాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

"చాలా మంది ఊహించని బ్రెగ్జిట్ నేడు నిజమైంది. కొందరు దీనిని స్వాగతిస్తున్నారు. మరికొందరు ఆందోళన చెందుతున్నారు. కానీ మరోవర్గం వారు, బహుశా అతిపెద్ద వర్గం వారు.. రాజకీయ గొడవలు ఎప్పటికీ ముగియవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ భావాలన్నీ అర్థం చేసుకున్నాను. దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వం ముందున్న కర్తవ్యం."

- బోరిస్ జాన్సన్​, బ్రిటన్ ప్రధాని

జనవరి 31 రాత్రి 11 గంటల తర్వాత అధికారికంగా ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగింది. ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్​, 'ఇది ముగింపు కాదు, ఆరంభం'అని వ్యాఖ్యానించారు. బ్రెగ్జిట్​ వల్ల బ్రిటన్​కు కొన్ని అవరోధాలు ఎదురుకావచ్చని, కానీ ఈ నిష్క్రమణ 'అద్భుత విజయానికి' ఒక అవకాశమని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పద్దు 2020: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

Last Updated : Feb 28, 2020, 5:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details