తెలంగాణ

telangana

ETV Bharat / international

పార్లమెంటుదే అధికారం.. మరి ప్రభుత్వం..? - EU

బ్రెగ్జిట్​పై పార్లమెంటు పాక్షిక అధికారం పొందింది. ఈ చర్యతో బ్రెగ్జిట్​పై బ్రిటన్​ ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఒప్పందంపై అధికారాన్ని పార్లమెంటుకు బదిలీ చేస్తూ ఓటేసిన ఎంపీలు ప్రత్యామ్నాయ ఒడంబడిక తెచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.

బ్రెగ్జిట్​పై పార్లమెంటుదే అధికారం..మరి ప్రభుత్వం?

By

Published : Mar 27, 2019, 7:01 AM IST

బ్రెగ్జిట్​పై పార్లమెంటుదే అధికారం..మరి ప్రభుత్వం?
బ్రెగ్జిట్​పై నిర్ణయాధికారాన్ని పార్లమెంటుకు దక్కేలా చేయడంలో బ్రిటన్​ చట్టసభ్యులు సఫలమయ్యారు. ఒప్పందంతో పాటు పార్లమెంటు కార్యక్రమాలపై అధికారం ఎంపీలకు దక్కింది. ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

ఐరోపా సమాఖ్య నుంచి విడాకులు తీసుకునే బ్రెగ్జిట్​ ఒప్పందంపై ఎంపీలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తెచ్చేందుకు అవకాశం దక్కింది.

ఈయూ నుంచి బ్రిటన్​ విడిపోయిన తర్వాత ఐరోపా అంతటినీ ఒకే మార్కెట్‌గా పరిగణించే ప్రతిపాదనను ఎంపీలు పరిశీలించే అవకాశం ఉంది. లేదంటే మొత్తం బ్రెగ్జిట్‌ను.. పూర్తిగా రద్దు చేసే మరో ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బ్రెగ్జిట్‌పై నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుతామని పార్లమెంటులో ఓటింగ్‌ తర్వాత ప్రధాని థెరిసా మే ప్రకటించారు. అయితే ఎంపీలు చేసే ప్రతిపాదనలు పూర్తిగా ఆమోదిస్తామని మాత్రం హామీ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం మార్చి 29న అధికారికంగా ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవాలి.

ప్రస్తుత పరిణామాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. థెరిసా మే సూచించిన ప్రత్యామ్నాయం ఆమోదం పొందితే మే 22న ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగేందుకు అవకాశం ఉంది. లేదంటే ఏప్రిల్‌12 లోపు నూతన కార్యాచరణను ఐరోపా సమాఖ్యకు బ్రిటన్ అందించాలి.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​ చిక్కులతో థెరిసా మే ఉక్కిరిబిక్కిరి

ABOUT THE AUTHOR

...view details