ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే గడువును పెంచేందుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఐరోపా నుంచి విడిపోయేందుకు మరింత సమయం కావాలన్న బిల్లుకు 210 ఓట్ల మెజారిటీ వచ్చింది. బ్రిటన్ను గడువు ముగిశాకా సమాఖ్యలో కొనసాగించేందుకు మిగతా 27 దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఐరోపా సమాఖ్య పాలకులు ఇప్పటికే గడువు పెంచేది లేదన్న సంకేతాల్ని బ్రిటన్‌కు పంపారు.
మరింత గడువు కావాల్సిందే..! - బ్రెగ్జిట్
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముందుగా నిర్ణయించిన మార్చి 29 గడువును పొడిగించేందుకు మొగ్గు చూపారు ఆ దేశ చట్టసభ సభ్యులు. మరింత గడువు కావాలన్న బిల్లుకు ప్రతినిధుల సభ 210 ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలిపింది.
బ్రెగ్జిట్‌కు మరింత సమయం కావాలని బ్రిటన్ ప్రతినిధుల సభ బిల్లు ఆమోదం
సమాఖ్య నుంచి బయటపడాలన్న అంశమై బ్రిటన్ పునరాలోచనలో పడిందన్నారు ఐరోపా మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్. కస్టమ్స్ ఒప్పందాల్లో యథాతథంగా కొనసాగితేనే బ్రిటన్‌కు అనుకూల నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర సమాఖ్య నేతలు మాత్రం బ్రిటన్‌కు మరింత గడువు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
"బ్రిటన్ పార్లమెంట్ కోరుకునేది ఏమిటో, బ్రిటన్ పాలకులకున్న ప్రత్యామ్నాయాలేమిటో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం"- చార్లెస్ మైఖేల్, బెల్జియం ప్రధాని