తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2019, 12:24 PM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​ మరింత ఆలస్యం... జూన్​ 30 కొత్త లక్ష్యం

ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడానికి మరింత సమయం పడుతుందని బ్రిటన్​ ప్రధాని థెరెసా మే ప్రకటించారు. ఈ విషయం తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధకలిగించిందని తెలిపారు.

ఒప్పందం లేకుండానే ఐరోపాను వీడుతున్నాం

ఒప్పందం లేకుండానే ఐరోపాను వీడుతున్నాం
ఐరోపా సమాఖ్యను వీడేందుకు మరింత ఆలస్యమవుతుందని బ్రిటన్​ ప్రధానమంత్రి థెరెసా మే ప్రకటించారు. నిర్ణీత గడువులో ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగలేకపోడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు.

" ఐరోపా సమాఖ్య నుంచి బయటకు రావాలని ప్రజలు నిర్ణయించి ఇప్పటికే దాదాపు మూడేళ్లయింది. బ్రిటన్ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది అతి పెద్ద విషయం. మార్చి 2017లో ఐరోపా నుంచి వైదొలగడానికి ప్రక్రియ ప్రారంభించాము. దీనికి పార్లమెంట్​ పూర్తి మద్దతు ప్రకటించింది. కానీ రెండు సంవత్సరాలు గడిచినా కార్యరూపం దాల్చడానికి ఎంపీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఫలితంగా మార్చి 29న ఒప్పందంతో ఐరోపా సమాఖ్య వైదొలగలేకపోతున్నాం. ఇది వ్యక్తిగతంగా నాకు చాలా విచారకరమైన విషయం."
-థెరిసా మే, బ్రిటన్​ ప్రధానమంత్రి

ప్రస్తుత పరిస్థితుల్లో ఐరోపా సమాఖ్య నుంచి జూన్​ నెలాఖరున వైదొలిగే అవకాశం ఉందని థెరెసా మే తెలిపారు.
ఒప్పందాన్ని ఇప్పటికే రెండు సార్లు చట్టసభ్యులు తిరస్కరించారు. మూడోసారి ఓటింగ్​కు ప్రధాని ప్రయత్నిస్తున్నారు.

బ్రెగ్జిట్​ తేదీని మార్చే అవకాశముంది....

బ్రిటన్​ చట్ట సభ్యులు ఆమోదం తెలిపితే బ్రెగ్జిట్​ గడువును పొడిగించే అవకాశం ఉందని ఐరోపా సమాఖ్య మండలి​ అధ్యక్షుడు డొనాల్డ్​ టస్క్​ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్​కు కేవలం కొద్దిరోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో డొనాల్డ్​ టస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రధానికి ఊరట కలిగించే విషయం.

"బ్రిగ్జిట్​ గడువు కొంచెం పొడిగించడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కానీ చట్ట సభ్యులు ఆమోదం ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. "
- డొనాల్డ్ టస్క్​, ఈయూ కౌన్సిల్​ అధ్యక్షుడు

వచ్చేవారం జరగనున్న పార్లమెంట్​ సమావేశాల్లో మరోసారి బ్రెగ్జిట్​ ప్రతిపాదన తేనున్నారు థెరెసా. ఇప్పటికే ఒప్పందాన్ని రెండుసార్లు తిరస్కరించారు చట్టసభసభ్యులు.

ABOUT THE AUTHOR

...view details