తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ ప్రధానిగా జాన్సన్​- బ్రెగ్జిట్టే అజెండా - ప్రధాని

బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ జాన్సన్​ ఎన్నికయ్యారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే ప్రధాన అజెండా అని స్పష్టంచేశారు జాన్సన్.

బ్రిటన్​ ప్రధానిగా జాన్సన్​- బ్రెగ్జిట్టే అజెండా

By

Published : Jul 23, 2019, 6:36 PM IST

బ్రిటన్ ప్రధానిగా కన్సర్వేటివ్ పార్టీ నేత బోరిస్ జాన్సన్ ఎన్నికయ్యారు. త్వరలో అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోయే బ్రెగ్జిట్ బిల్లు కీలక దశలో ఉన్న నేపథ్యంలో... దేశంలోని సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్ని చక్కదిద్దడం జాన్సన్​ ముందున్న ప్రధాన సవాలు.

అంతర్గతంగా...

బ్రెగ్జిట్​ సంక్షోభంతో ప్రధాని పదవి నుంచి థెరిసా మే తప్పుకోవడం అనివార్యమైంది. ఫలితంగా కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంటరీ పక్షనేతగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సి వచ్చింది. పార్టీ సభ్యులంతా ఓటు వేసిన ఈ ఎన్నికల్లో విదేశాంగ మంత్రిగా, లండన్​ మేయర్​గా గతంలో పనిచేసిన బోరిస్ జాన్సన్​కు, మాజీ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. చివరకు జాన్సన్​ను విజయం వరించింది.

మెజారిటీ విజయం

బోరిస్ జాన్సన్​కు 92, 153 ఓట్లు రాగా... జెరెమీ హంట్ 46, 656 ఓట్లు సాధించారు. 509 ఓట్లు చెల్లలేదు.

బుధవారం తర్వాతే ప్రమాణస్వీకారం

ప్రస్తుత ప్రధాని థెరిసా మే బుధవారం ప్రధానిగా రాజీనామా చేసే అవకాశం ఉంది. నూతన కేబినెట్​పై జాన్సన్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

భారత సంతతి ఎంపీలకు కేబినెట్​లో స్థానం!

భారత సంతతికి చెందిన ఎంపీలు ప్రీతి పటేల్, రిషి సునక్​లకు జాన్సన్ కేబినెట్​లో చోటు దక్కే అవకాశం ఉంది.

"కన్సర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధానిగా బోరిస్ జాన్సన్​ నూతన ప్రణాళికలతో దేశాన్ని ముందుకు తీసుకెళతారని బ్రిటన్​ ప్రజల్లో విశ్వాసం ఉంది. భారత్​ సహా మిత్రదేశాలతో సంబంధాలను జాన్సన్ పునరుద్ధరిస్తారని నమ్మకం ఉంది."

-ప్రీతి పటేల్, ఎంపీ

ఇదీ చూడండి: 'ట్రంప్​ వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details