తెలంగాణ

telangana

ETV Bharat / international

'బ్రెగ్జిట్' వైఫల్యంపై బ్రిటన్ ప్రధాని బోరిస్​ విచారం - britian parliament latest news

బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. అయితే డిసెంబరులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తే.. ఐరోపా సమాఖ్య నుంచి జనవరి 31లోగా బ్రిటన్​ వైదొలగడం ఖాయమని చెప్పారు.

బ్రెగ్జిట్ గడువు వైఫల్యంపై బ్రిటన్ ప్రధాని విచారం

By

Published : Nov 4, 2019, 6:01 AM IST

ఐరోపా సమాఖ్య నుంచి అక్టోబరు 31లోగా బ్రిటన్​ వైదొలగ లేకపోయిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్. ఆలస్యానికి పార్లమెంటే కారణమన్నారు. డిసెంబరు 12న జరిగే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ మెజారిటీ సాధిస్తే.. కొత్త గడువైన జనవరి 31లోగా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలుగుతుందని ఉద్ఘాటించారు. ఓ న్యూస్ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు బోరిస్​.

హామిని నిలబెట్టుకుంటారని ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా అన్న ప్రశ్నకు బదులిచ్చారు బోరిస్​.

'జరిగిన పరిణామాల్ని మరిచిపోకూడదు. పార్లమెంటులో సరెండర్​ యాక్ట్ ఆమోదం పొందడం వల్లే బ్రెగ్జిట్ గడువు పెంచాలని ఈయూకి లేఖ పంపాల్సి వచ్చింది' అని వివరణ ఇచ్చారు.

బ్రెగ్జిట్ బిల్లు తమ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు బోరిస్​. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఒకవేళ అనుకున్న మెజారీటీ వస్తే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వెంటనే వైదొలుగుతుందని స్పష్టం చేశారు.

ఐరోపా సమాఖ్య నుంచి గత నెల 31లోపే బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. కాని ఇందుకు అవసరమైన బ్రెగ్జిట్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందలేక పోయింది. అనంతరం బ్రెగ్జిట్ గడవును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించేందుకు ఈయూ అంగీకారం తెలిపింది. అయితే గడువు పెంచాలంటే ముందస్తు ఎన్నికలకు ఒప్పుకోవాలనే బోరిస్ వినతికి ఎంపీలు అంగీకారం తెలిపారు. డిసెంబరు 12న బ్రిటన్​లో​ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details