జర్మనీ బెర్లిన్లోని బ్రాండన్బర్జ్ గేట్ గగనతలంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నిండు జాబిలి పూర్తిగా నీలి రంగులోకి మారే అరుదైన సన్నివేశం శనివారం అర్ధరాత్రి వీక్షకులకు కనువిందు చేసింది. చంద్రుడి అరుదైన రూపాన్ని చూసిన అనుభూతి అమెరికాలోని మయామి వాసులకూ దక్కింది.
ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చిన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది.