తెలంగాణ

telangana

ETV Bharat / international

వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు - assange

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను బ్రిటన్​ పోలీసులు అరెస్టు చేశారు. 2012 జూన్​ నుంచి లండన్​లోని ఈక్వెడార్​ దౌత్యకార్యాలయంలో తలదాచుకుంటున్నారు అసాంజే. తాజాగా ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకుంది.

వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు

By

Published : Apr 11, 2019, 4:35 PM IST

ఏడేళ్లుగా లండన్​లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో తలదాచుకుంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను బ్రిటన్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్వెడార్​ ఆశ్రయాన్ని విరమించుకున్న వెంటనే పోలీసులు అసాంజేను అరెస్టు చేశారు.

అసాంజేను వెస్ట్​మినిస్టర్ కోర్టులో హాజరు పరిచే వరకూ మధ్య లండన్​ పోలీసుల నిర్బంధంలోనే ఉండనున్నారు. 2012లోనే బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అసాంజేపై స్కాట్​లాండ్ యార్డు పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే వికీలీక్స్​లో అమెరికా రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. ఆ దేశం నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్​లోని ఈక్వెడార్​ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు.

అసాంజేను అమెరికాకు అప్పగించే అవకాశాలున్నాయి. అదే జరిగితే, అసాంజే తీవ్రమైన శిక్షలు ఎదుర్కొంటారని తెలుస్తోంది.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​ వాయిదా... అక్టోబర్​ 31వరకు గడువు

ABOUT THE AUTHOR

...view details