తెలంగాణ

telangana

ETV Bharat / international

లండన్​పై గొర్రెల దండయాత్ర... ఎందుకంటే ? - లండన్​

లండన్​కు విశిష్ట అతిథులు వచ్చాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లపై దర్జాగా నడిచాయి. నగర ప్రముఖులు వాటికి సకల మర్యాదలు చేశారు. ఎందుకు ఇదంతా...?

లండన్​లో గొర్రెల దండయాత్ర.

By

Published : Sep 30, 2019, 4:53 PM IST

Updated : Oct 2, 2019, 2:54 PM IST

లండన్​పై గొర్రెల దండయాత్ర... ఎందుకంటే ?

వాడీవేడి రాజకీయాలు, విరామం లేని వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రమైన లండన్​ నగరంలో గొర్రెలు హల్​చల్​ చేశాయి. ప్రఖ్యాత లండన్​ బ్రిడ్జ్​ సహా ప్రధాన రహదారులపై దర్జాగా నడిచాయి.
లండన్​లో గొర్రెల విహారం వెనుక 800 ఏళ్ల చరిత్ర ఉంది. నగరం స్థాపించిన నాటి నుంచి ఏటా 'లండన్​ షీప్ డ్రైవ్​' పేరిట ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలో భాగంగా కొందరు ఔత్సాహికులు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు.

Last Updated : Oct 2, 2019, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details