తెలంగాణ

telangana

ETV Bharat / international

ఖనిజాలతో గుహ... ఈ 'జియోడ్​'పై లుక్కేయండి - జియోడ్​

స్పెయిన్​లో సహజసిద్ధ ఖనిజాలతో కూడిన ఓ గుహ తొలిసారిగా సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది అక్టోబర్​లో గుహలోకి వీక్షకులను అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఖనిజాలతో గుహ... ఈ 'జియోడ్​'పై లుక్కేయండి

By

Published : Jun 13, 2019, 6:27 AM IST

స్పెయిన్​లో సహజసిద్ధ ఖనిజాలతో కూడిన గుహ

ఏదైనా గుహలోకి ప్రవేశిస్తే చిమ్మ చీకటితో కూడిన ప్రదేశం దర్శనమిస్తుంది. కానీ స్పెయిన్​లోని అండాలూసియా సమీపంలోని ఓ గుహ ఇందుకు విరుద్ధంగా ఖనిజాలతో అబ్బురపరుస్తోంది. పెద్ద మొత్తంలో సహజసిద్ధ ఖనిజాలు కలిగిన ఈ జియోడ్​ గుహను తొలిసారిగా ఈ ఏడాది అక్టోబర్​లో వీక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు అధికారులు.

స్పెయిన్​లోని అండాలూసియా పట్టణానికి 50 మీటర్ల దూరంలో ఈ గుహ ఉంది. రాతితో కూడిన ఈ ఖనిజ గనులనే 'జియోడ్​' అని పిలుస్తారు. ఇక్కడి సహజసిద్ధ ఖనిజ సంపదతో తమ పట్టణం పల్పి రూపురేఖలు మారతాయని స్థానికుల విశ్వాసం. సందర్శకులు గుహలోకి ప్రవేశించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

"ఐరోపా ఖండంలో ఇలాంటి జియోడ్​ ఇదొక్కటే. మెక్సికోలోని నైకా గని​లో ఇలాంటి జియోడ్​ ఒకటుంది. అది దీనికంటే చాలా పెద్దది. అయితే 200 మీటర్ల లోతు ఉన్నందున అందులోకి వీక్షకులు వెళ్లడం కష్టం. ప్రపంచంలో వీక్షకులు ప్రవేశించగల అతిపెద్ద జియోడ్​ ఇదే."

- ఫెర్నాండెజ్​ అమో, భూగోళ శాస్త్రజ్ఞులు

ABOUT THE AUTHOR

...view details