రోడ్లమీద గంటకు 30 కి.మీకి మించి.. అధిక వేగంతో ప్రయాణిస్తే వేటు తప్పదంటున్నారు పారిస్ అధికారులు. పర్యావణ హితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్, లాటిన్ క్వార్టర్ లాంటి ప్రాంతాలవైపు వెళ్లేటప్పడు నిర్దేశించిన వేగానికి మించకుండా ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు. సోమవారం నుంచి దాదాపు పారిస్‌లోని అన్ని వీధుల్లో ఈ నిర్ణయం అమలవుతుందని అక్కడి అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
నగరంలో కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న అధికారులు.. ఈ నిర్ణయంతో నగరంలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వివరించారు. పాదాచారులకు మరింత సౌకర్యవంతగా ఉంటుందని పేర్కొన్నారు.