రష్యాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా '2019' నిల్చిపోనుంది. భూతాపం పెరగడం వల్లే ఈ వాతవరణ మార్పులు సంభవించాయని వాతవరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ ఏడాది మాస్కోలో సగటు ఉష్ణోగ్రత 45.7 నుంచి 45.9 డిగ్రీల ఫారెన్హీట్గా నమోదైందని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే... ఈ ఏడాది ఉష్ణోగ్రత 0.3 డిగ్రీలు పెరిగిందని వెల్లడించింది.
" సంవత్సరమంతా రికార్డైన ఉష్ణోగ్రతలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత... ఈ ఏడాది రష్యాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైందని నిర్ధరించాం."