ప్రపంచవ్యాప్తంగా 2019 రెండో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా నిలిచిందని ఐరోపా సమాఖ్య వాతావరణ పర్యవేక్షణ సంస్థ ప్రకటించింది. గడిచిన పదేళ్లను.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా పేర్కొంది ఆ సంస్థ.
కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2016 తర్వాత, గతేడాది.. 0.12 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. ఎల్నినో ప్రభావం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపింది.
2010 నుంచి 2019 వరకు చివరి ఐదేళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సీ3ఎస్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 2019లో.. 1981-2010 మధ్య కాలంతో పోలిస్తేఉష్ణోగ్రత 0.6 డిగ్రీ సెల్సియస్ పెరిగినట్లు తెలిపింది సీ3ఎస్. భూతాపం పారిశ్రామికీకరణకు ముందుతో పోలిస్తే.. గత ఐదేళ్లలో 1.1 సెంటిగ్రేడ్ నుంచి 1.2 సెంటిగ్రేడ్ పెరిగిందని సీ3ఎస్ వెల్లడించింది.
ఐరోపా వరకు అయితే గతేడాదే అత్యధికఉష్ణోగ్రతనమోదైనట్లు తెలుస్తోంది. 2019 రెండో అత్యధికఉష్ణోగ్రతలు నమోదైన ఏడాది అయిప్పటికీ.. మొదటి స్థానంలో ఉన్న 2016తో పోలిస్తే 0.04 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే తక్కువగా ఉన్నట్లు సీ3ఎస్ పేర్కొంది. ఉష్ణోగ్రతతో పాటు వాతావరణంలో కార్బన్ శాతం 2019లోనూ పెరిగి చరిత్రలో అత్యధిక స్థాయికి చేరినట్లు తేలింది.
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్