అల్బేనియాలో తీరం వెంబడి పలుమార్లు సంభవించిన భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య 20కి చేరింది. 600 మంది క్షతగాత్రులయ్యారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు అధికంగా తుమనే, డర్రస్ పట్టణాలకు చెందినవారిగా అధికారులు నిర్ధరించారు. మంగళవారం రాత్రి 42 మందిని కాపాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి వెల్లడించారు.
తమ కుటుంబసభ్యుల ఆచూకీ కోసం బంధువులు విలవిల్లాడుతున్నారు.
"మా అమ్మ, మేనకోడలు భవనంలో చిక్కుకుపోయారు. వారు బతికి ఉన్నారో లేదో తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది."