తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ దేశాలపై ఆగని 'కరోనా మరణ మృదంగం'

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై మరణ మృదంగం మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య లక్షా 8వేలకు పైగా నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలకు చేరువలో ఉంది. అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య 20వేలు దాటింది.

worldwide corona death toll
ప్రపంచ దేశాలపై ఆగని 'కరోనా మరణ మృదంగం'

By

Published : Apr 12, 2020, 6:14 AM IST

Updated : Apr 12, 2020, 8:08 AM IST

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్​, బ్రిటన్​, జర్మనీ దేశాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 18 లక్షలకు చేరువలో ఉన్నాయి. లక్షా 8వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. అమెరికాలో సగటున రోజుకు 2వేల మంది చనిపోతున్నారు. ఫలితంగా అగ్రరాజ్యంలో కరోనా మృతుల సంఖ్య ఇటలీని దాటింది. స్పెయిన్​లో మాత్రం కరోనా మరణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

దేశాల వారీగా కేసుల వివరాలు

లాక్​డౌన్ ఎత్తివేయండి

ఇటలీలో కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో అక్కడి ప్రజలు లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నారు. ఐదు వారాలుగా ఒంటరితనంతో జీవిస్తున్నామని, వేసవి కారణంగా ఉక్కపోతను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటలీలో 24 గంటల్లో 619 మంది మహమ్మారికి బలయ్యారు. మరో దాదాపు 5 వేల మందికి వైరస్​ సోకింది.

స్విట్జర్లాండ్​​లో...

స్విట్జర్లాండ్​లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 25 వేల కేసులు నమోదు కాగా... వెయ్యి మందికి పైగా మరణించారు.

ఫ్రాన్స్​లో...

ఫ్రాన్స్​లోనూ కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 643 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 353 మంది ఆసుపత్రుల్లో మరణించగా, మరో 290 మంది నర్సింగ్​ హోంలో మృతి చెందినట్లు తెలిపారు. మరో 4,800 కేసులు నమోదయ్యాయి.

Last Updated : Apr 12, 2020, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details