ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేసాయి. 5జీ సాంకేతికతతో సామ్సంగ్ రూపొందించిన 'ఎస్10 5జీ' మోడల్ మొబైల్ ఫోన్ను విడుదల చేసింది. దక్షిణ కొరియాలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ కొరియా మొబైల్ సేవల సంస్థలు ఎస్కే టెలికాం, ఎల్జీ యూప్లస్లు కూడా ఒకే రోజు 5జీ నెట్వర్క్ సేవలు ప్రారంభించాయి. తొలిసారి వాణిజ్యపరంగా 5జీ మొబైల్ సేవలు అందించిన దేశంగా నిలిచింది దక్షిణకొరియా.
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో నేటి (శుక్రవారం)నుంచే వినియోగదారుల చేతికి 5జీ మొబైల్ ఫోన్లు అందాయి. తొలిసారిగా కొందరు లక్కీ కస్టమర్లకు ఈ అవకాశం కల్పించాయి మొబైల్ సంస్థలు. ఈ ఏడాది చివరి వరకు 85 ప్రధాన నగరాలకు 5జీ సేవలను విస్తరిస్తామని కొరియా ప్రభుత్వం, టెలికాం సంస్థలు పేర్కొన్నాయి.
మొదటి ఫోన్ను కొరియాకు చెందిన ఓహ్ వాన్చాంగ్ అందుకున్నాడు. అతని ఆనందానికి అవధులు లేవు.