ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 5కోట్ల 33 లక్షలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. 13 లక్షల 2వేల మందికిపైగా కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు 3కోట్ల 73లక్షల మందికిపైగా మహమ్మారిని జయించారు. 1.46కోట్ల యాక్టివ్ కేసులున్నాయి.
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.08కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.48 లక్షల మందికిపైగా మరణించారు.
- రష్యాలో ఒక్కరోజులోనే 21,983 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య 18లక్షల 80వేలు దాటింది. వైరస్‌తో మరో 411 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 32వేల 443కు ఎగబాకింది.
- నేపాల్‌లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 2,111 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 2లక్షల 6వేలకు చేరింది. మరో 13 మరణాలతో.. మృతుల సంఖ్య 1,202కు చేరింది.
- పాక్‌లో మరో 2,304 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3లక్షల 52వేల 296కు చేరింది. మరో 37 మంది మృతిచెందడం వల్ల.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 7,092కు పెరిగింది.