ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి వైరస్ బాధితుల సంఖ్య 83లక్షలు దాటిపోయింది. ఇప్పటివరకు 83,10,872మంది వైరస్ బారిన పడ్డారు. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మొత్తం 4,47,362 మంది వైరస్ బారినపడి మృతి చెందారు.
కరోనా విలయం.. 83 లక్షలు దాటిన కేసులు
ప్రపంచ దేశాలపై కరోనా విలయతాండవం ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటివరకు 83లక్షల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. 4లక్షల 47వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
కొవిడ్ విలయం.. 83 లక్షలు దాటిన బాధితులు
కరోనా ఉద్ధృతి కొనసాగుతోందిలా..
- రష్యాలో కరోనా కేసులు 5.5 లక్షలు దాటాయి. గడచిన 24గంటల్లో 7,843మందికి వైరస్ సోకింది. మరో 194మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. ఆ దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 5,53,301కు చేరగా.. 7,478 మంది మరణించారు.
- మెక్సికోలో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,599 మంది మహమ్మారి బారినపడగా.. 730 మంది మృతిచెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 18,310కు చేరింది. ఇప్పటివరకు ఆ దేశంలో 1,54,863 వైరస్ కేసులు వెలుగుచూశాయి.
- పాకిస్థాన్లో వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 5,839 వైరస్ కేసులు నమోదవ్వగా.. 136 మంది చనిపోయారు. ఇప్పటివరకు పాక్లో మొత్తం 1,54,760 మందికి కొవిడ్ సోకగా.. 2,975 మరణాలు నమోదయ్యాయి.
- బంగ్లాదేశ్లో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4వేలకుపైగా వైరస్ కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. మరో 43మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు బంగ్లాలో 98,489 మందికి కరోనా సోకగా.. 1,305 మంది మరణించారు.
- సౌదీ అరేబియాలో ఒక్కరోజు వ్యవధిలో 4,919 కరోనా కేసులు బయటపడగా.. మరో 39మంది మృతి చెందారు. ఇప్పటివరకు సౌదీలో మొత్తం 1,41,234 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,091కు చేరింది.
- ఇరాన్లో 24 గంటల వ్యవధిలో మరో 2,612 మందికి వైరస్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువైంది. మరో 120మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో 1,95,051 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 9,185మంది మరణించారు.
- నేపాల్లో కరోనా కోరలు చాస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 586మందికి వైరస్ సోకింది.
- సింగపూర్లో ఒక్కరోజులో 247 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 41,216 కు చేరింది. ఇప్పటివరకు అక్కడ మొత్తం 20మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:కరోనా వల్ల వీరికి 12రెట్లు ప్రమాదం ఎక్కువ!
Last Updated : Jun 17, 2020, 9:36 PM IST