భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ బ్యాంకు 100 కోట్ల డాలర్ల అత్యవసర సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన ప్రక్రియకు ఆమోదం తెలిపింది.
ప్రపంచ బ్యాంకు గతంలోనే 25 దేశాలకు సాయం అందించేందుకుగాను 190 కోట్ల డాలర్లు ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపింది. ఇప్పుడు మరో 40 దేశాలకు సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకు అందించే ఈ ఆర్థిక సాయంలో సింహభాగం భారత్‌కు అందుతుంది.
"ఈ నిధులతో భారత్‌లో ల్యాబ్‌లో సామర్థ్యం పెంచడానికి, పీపీఈల కొనుగోలుకు, మరిన్ని ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా కరోనా వైరస్ స్క్రీనింగ్‌ను మరింత సమర్థంగా చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే కాంటాక్ట్‌లను గుర్తించడం సులభమవుతుంది." -ప్రపంచ బ్యాంకు