ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్‌లో కార్చిచ్చు భారీ ఆస్తి నష్టానికి కారణమైంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇళ్లు, లక్ష హెక్టార్లకుపైగా అడవిని బూడిద చేసింది.
250 మంది నివసించే రాప్విల్లే గ్రామం అగ్నికి ఆహుతైంది. కార్చిచ్చు కారణంగా గ్రామస్థులు కొందరు గాయపడ్డారు. మరికొందరు శ్వాస సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. సహాయక సిబ్బంది గ్రామాన్ని ఖాళీ చేయించారు. బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు.
అడవిలో 40 వేర్వేరు చోట్ల మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా... వేడి గాలులు అందుకు ప్రతిబంధకంగా మారాయి.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు- లక్ష హెక్టార్ల అడవి దగ్ధం - australia
ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్‌లో కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే లక్ష హెక్టార్ల అడవిని బూడిద చేసిన దావానలాన్ని ఆర్పేందుకు 500 మంది ప్రయత్నిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుకు మరో గ్రామం ఆహుతి
ఇదీ చూడండి : గాలికి భయపడి అమెరికాలో కరెంట్ కట్