చైనాలోని ఉత్తర ప్రావిన్సులో.. మరోసారి లాక్డౌన్ విధించింది ఆ దేశం. కరోనా కేసుల సంఖ్య పెరుగుదలతో పాటు 2022లో జరగనున్న శీతకాల ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయాలను కారణాలుగా తెలిపింది. దగ్గర్లో ఉన్న లియోనింగ్ ప్రావిన్సులోని షెన్యాంగ్, దాలియన్ పట్టణాల్లోనూ ఆంక్షలు కొనసాగనున్నాయి.
కఠిన ఆంక్షలు..
హుబే రాజధాని షిజియాజువాంగ్‌లో సుమారు కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ.. అన్నిరకాల రవాణాను నిలిపివేశారు. పట్టణాలు, గ్రామాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. పాఠశాలలను రద్దు చేశారు. గత ఆదివారం నుంచి ఇక్కడ కొత్తగా 51 కొవిడ్ కేసులు వచ్చాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90కి చేరిందని తెలిపింది. వీటిలోనూ అత్యధికంగా షిజియాజువాంగ్, గ్జింగ్టాయ్ ప్రాంతాల నుంచే కేసులు వచ్చాయని పేర్కొంది.