సెంట్రల్ వియత్నాం, క్వాంగ్ బిన్హ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి స్థానిక ఆర్మీ స్థావరంపై పడ్డాయి. ఈఘటనలో 8మంది ప్రాణాలతో బయటపడగా 22మంది సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. సహాయక సిబ్బంది ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశారు.
కొండచరియలు విరిగిపడి 22 మంది జవాన్లు మృతి
సెంట్రల్ వియత్నాంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 22మంది సైనికాధికారులు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వియత్నాంలో కొండచరియలు విరిగిపడి 22మంది మృతి
గతవారం తువా తీన్-హూ, క్వాంగ్ట్రీ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో 11 మంది సైనికాధికారులు సహా మొత్తం 13 మంది మరణించారు.
గతకొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు వియత్నాం అతలాకుతలమవుతోంది. రానున్న రోజుల్లో వానలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Last Updated : Oct 18, 2020, 6:02 PM IST