ఈశాన్య ఫిలిప్పీన్స్లో 'వామ్కో' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వరదల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు.
తుపాను ధాటికి గురువారం గంటకు 140-195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈదురు గాలుల ప్రభావంతో ఉత్తర మనీలా, బులాకాన్, పంపాంగ రాష్ట్రాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.