తెలంగాణ

telangana

ETV Bharat / international

వాణిజ్య యుద్ధం: అర్థవంతమైన పురోగతే లక్ష్యం..!

అమెరికా-చైనాల మధ్య మెల్లమెల్లగా వాణిజ్య యుద్ధం సద్దుమణిగేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చే విధంగా అమెరికా ఉత్పత్తులు కొన్నింటిపై చైనా సుంకాలను తొలగించింది. అనంతరం.. చైనా దిగుమతులపై సుంకాల బాదుడును 15 రోజుల పాటు వాయిదా వేశారు ట్రంప్​. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న చర్చల్లో అర్థవంతమైన పురోగతి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు అమెరికా ట్రెజరీ విభాగ కార్యదర్శి స్టీవెన్​ ముచిన్​.

వాణిజ్య యుద్ధం: అర్థవంతమైన పురోగతే లక్ష్యం..!

By

Published : Sep 13, 2019, 5:31 AM IST

Updated : Sep 30, 2019, 10:14 AM IST

అక్టోబర్​ ఆరంభంలో జరగనున్న అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో అర్థవంతమైన పురోగతి కోరుకుంటున్నట్లు తెలిపారు అమెరికా ట్రెజరీ విభాగ కార్యదర్శి స్టీవెన్​ ముచిన్​. సంక్షోభానికి ముగింపు పలికేలా ఒప్పందం జరగాలని అభిప్రాయపడ్డారు. అమెరికా వాణిజ్య విశ్లేషకులూ ఇదే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారయన.

'మేం చైనాతో చర్చల పరంపర మాత్రమే కొనసాగాలని అనుకోవట్లేదు. ఒక అర్థవంతమైన పురోగతిని కోరుకుంటున్నాం.'

- ముచిన్​, అమెరికా ఖజానా విభాగ కార్యదర్శి

తమ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఒక మంచి ఒప్పందాన్ని మాత్రమే అంగీకరిస్తారని.. అవసరమైతే మళ్లీ సుంకాలను పెంచే అవకాశముందని హెచ్చరించారు.

సానుకూల సంకేతాలు..

త్వరలో జరగనున్న వాణిజ్య చర్చలకు ముందు ఇరు దేశాల మధ్య సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఉత్పత్తులు కొన్నింటిని చైనా సుంకాల జాబితా నుంచి తొలగించింది. అనంతరం.. అమెరికా కూడా చైనా దిగుమతులపై సుంకాల బాదుడును 15 రోజుల పాటు వాయిదా వేసింది.

ఇప్పుడు అమెరికా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్​, పంది మాంసం కొనుగోళ్లపైనా ఆలోచిస్తున్నట్లు చైనా పేర్కొంది. భవిష్యత్తులో వీటిపైనా సుంకాలు తొలగించే అవకాశముంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కూడా.. ఇదే కోరుకుంటూ ట్వీట్​ చేశారు.

వాణిజ్య యుద్ధంతో అమెరికా కంటే చైనాకే ఎక్కువ నష్టమని చెబుతూ వస్తున్నారు ట్రంప్​. అయితే.. అమెరికాపైనా దీని ప్రభావం భారీగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో కీలక పరిశ్రమల్లో ఉపాధి కల్పన తగ్గిపోయిందని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య చర్చలు ఎలాంటి ఫలితాన్నిస్తాయోనని ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి:వాణిజ్య యుద్ధం: సుంకాలపై వెనక్కి తగ్గిన చైనా..!

Last Updated : Sep 30, 2019, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details