తెలంగాణ

telangana

ETV Bharat / international

జీ-20: ప్రపంచ గమనం వారి చేతుల్లోనే!

జపాన్​ వేదికగా జరగనున్న జీ-20 సదస్సులో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ఇరాన్​తో​ ఉద్రిక్తతలు కీలక అంశాలు కానున్నాయి. ఉత్తర కొరియా, వెనుజువెలా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనంపైనా విస్తృత చర్చ జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జీ-20: ప్రపంచ గమనం వారి చేతుల్లోనే!

By

Published : Jun 26, 2019, 10:44 AM IST

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ఇరాన్​తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు... జపాన్​ ఒసాకాలో శుక్రవారం ప్రారంభం కానున్న జీ-20 సదస్సులో కీలక అంశాలు కానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియా, వెనుజువెలా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై చర్చ ప్రధాన అజెండా అయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే... జీ-20 వేదికగా చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో చర్చిస్తానని ప్రకటించడం ద్వారా వాణిజ్య యుద్ధం ముగింపుపై ఆశలు రేకెత్తించారు డొనాల్డ్ ట్రంప్. శనివారం ఇరువురి మధ్య జరిగే చర్చలు ఏమేరకు సఫలమవుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఉత్తర కొరియా అణ్వాయుధాలపై...

జీ-20 వేదికగా ఉత్తర కొరియా అణ్వాయుధాల కార్యక్రమంపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కూడా జిన్​పింగ్​, ట్రంప్​ సమావేశం కీలకం కానుందని భావిస్తున్నారు. ఉత్తర కొరియాతో చర్చలకు చైనా అధ్యక్షుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు.

జీ-20 సదస్సులో సముద్రాల్లో ప్లాస్టిక్​ కాలుష్యం, జనాభా పెరుగుదల అంశాలపైనా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:జీ-20 వేదికగా ట్రంప్​ - జిన్​పింగ్​ భేటీ

ABOUT THE AUTHOR

...view details