తెలంగాణ

telangana

ETV Bharat / international

చతుర్ముఖ కూటమి విదేశాంగ మంత్రుల భేటీ

చతుర్ముఖ కూటమి దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జపాన్ రాజధాని టోక్యోలో మంగళవారం ప్రారంభమైంది. హిందూ- పసిఫిక్​ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలతో పాటు కరోనా అనంతర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

quad meet
విదేశాంగ మంత్రుల భేటీ

By

Published : Oct 6, 2020, 10:14 PM IST

భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా విదేశాంగ మంత్రుల స్థాయి రెండో ‘చతుర్ముఖ’ సమావేశం టోక్యోలో మంగళవారం ప్రారంభమైంది. కరోనా ప్రారంభమైన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ భేటీ రెండు రోజులు కొనసాగనుంది.

విదేశాంగ మంత్రుల భేటీ

హిందూ-పసిఫిక్‌ అంతటా చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో ఈ చతుర్ముఖ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో భారత్‌కు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాలకూ తీవ్ర విభేదాలు ఉన్నాయి.

క్వాడ్ విదేశాంగ మంత్రులు

ఈ భేటీలో భాగంగా తొలుత నాలుగు దేశాల విదేశాంగ మంత్రులతో జపాన్ ప్రధాని యోషిహిండే సూగా సమావేశమయ్యారు. హిందూ- పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యంతో పాటు చైనా దూకుడుకు కళ్లెం వేయటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు సూగా. కరోనా తర్వాత ఈ సవాళ్లను సమన్వయంతో ఎదుర్కోవాలని సూచించారు.

ఇదీ చూడండి:'క్వాడ్' స్కెచ్​తో చైనాలో కంగారు- భారత్​పై ఫైర్​

ABOUT THE AUTHOR

...view details