తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక ఉగ్రదాడిపై ఐరాస విచారం

శ్రీలంక ఉగ్రదాడిపై ఐరాస తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించింది.

ఐరాస

By

Published : Apr 22, 2019, 7:54 AM IST

శ్రీలంక ఉగ్రదాడిపై ఐరాస విచారం.

పవిత్ర ఈస్టర్​ రోజున శ్రీలంకలో జరిగన మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయివారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

దేశంలో నెలకొన్న భయానక పరిస్థితుల నుంచి శ్రీలంక త్వరగా బయటపడాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐరాస పేర్కొంది.

ఈస్టర్​ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలు, స్టార్ హోటళ్లు లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు రెచ్చిపోయాయి.

ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 215 మందికి పైగా మృతి చెందగా... 600 మందికిపైగా గాయాలపాలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details