తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​పై భీకర దాడులు.. రంగంలోకి విదేశీ ఫైటర్లు! - ఉక్రెయిన్ యుద్ధం

UKraine Crisis: ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శుక్రవారం భీకర దాడులు చేపట్టాయి. రెండు వైమానిక స్థావరాల సమీపంలో, మరో అణు కేంద్రంపై రష్యా బాంబులు వేసింది. 16 వేల మంది విదేశీ ఫైటర్లను పుతిన్​ రంగంలోకి దించుతున్నారని సమాచారం.

UKraine Crisis
ఉక్రెయిన్​

By

Published : Mar 12, 2022, 4:57 AM IST

Updated : Mar 12, 2022, 5:36 AM IST

UKraine Crisis: రష్యా రూటు మార్చింది! ప్రపంచ దేశాలు ఎంత నచ్చజెప్పినా నెమ్మదించని పుతిన్‌ సేనలు.. ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శుక్రవారం భీకర దాడులు చేపట్టాయి. మేరియుపొల్‌లోని ప్రసూతి ఆస్పత్రిపై బాంబులు కురిపించి ముగ్గుర్ని బలి తీసుకున్న గంటల వ్యవధిలోనే... పశ్చిమాన ఉన్న లుట్స్క్‌ సైనిక వైమానిక స్థావరంపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇద్దరు అధికారులు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికి సమీపంలోని ఇవానో ఫ్రాంకిస్క్‌ వైమానిక స్థావరంపైనా బాంబులు కురిపించడంతో.. భారీ విధ్వంసమే చోటుచేసుకొంది. యుద్ధ ఆరంభంలో ఉక్రెయిన్‌లోని ప్రభావిత ప్రాంతాల నుంచి వేలమంది పౌరులు పొట్టచేతపట్టుకుని ఎల్వివ్‌కు చేరుకున్నారు. అక్కడి మానవతా శిబిరాల్లో, స్నేహితుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు రష్యా తాజాగా దాడులు చేపట్టిన వైమానిక స్థావరాలు ఈ శిబిరాలకు కేవలం 130, 150 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

ముట్టడికే మొగ్గు...

Russia Invasion: కొద్దిరోజుల క్రితం రాజధాని కీవ్‌ శివారుకు చేరుకున్న 64 కి.మీ. భారీ సైనిక వాహనశ్రేణి ఇప్పుడు సమీప పట్టణాలు, అటవీ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా కనిపిస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సైనికులు ఆ కాన్వాయ్‌లోని యుద్ధ ట్యాంకులను చిత్తుచేసే క్షిపణులను సిద్ధం చేసుకున్నట్టు కూడా వారు తెలిపారు. ఈ కాన్వాయ్‌లోని వాహనాలు పశ్చిమదిశగా కదులుతూ, కీవ్‌ దక్షిణ భాగాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నట్టు బ్రిటన్‌కు చెందిన పరిశోధనకర్త జాక్‌ వాట్‌లింగ్‌ విశ్లేషించారు. కీవ్‌పై దాడి చేయడం కంటే దాని ముట్టడికే రష్యా ప్రాధాన్యమిస్తున్నట్టు దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. క్షేత్రస్థాయి అవరోధాల కారణంగా రష్యా తన వ్యూహాన్ని మార్చుకుని ఉండొచ్చని బ్రిటన్‌ రక్షణశాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి.

సిరియా నుంచి బలగాలు?

Russia War: ఎంతకూ చేజిక్కని కీవ్‌ను కొల్లగొట్టేందుకు పుతిన్‌ సరికొత్త వ్యూహానికి తెరతీశారు. విదేశాలకు చెందిన 16,000 మంది ఫైటర్లను ఉక్రెయిన్‌లో దించేందుకు ఆయన ఆదేశాలు జారీచేశారు. వీరంతా మధ్య ఆసియాకు చెందినవారని, వీరిలో చాలామంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థపై పోరాడినవారేనని రష్యా రక్షణమంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. నిజానికి వీరంతా రష్యా అనుకూల సిరియా నుంచి రానున్నట్టు తెలుస్తోంది. ఐరోపాలోనే అతిపెద్ద అణు రియాక్టర్‌ 'జాపోరిజియా' భవనంపై దాడిచేసిన పుతిన్‌ బలగాలు... తాజాగా ఖర్కివ్‌లోని అణు పరిశోధన కేంద్రంపై విరుచుకుపడ్డాయి. దీంతో ఈ యూనిట్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

ఇదీ చదవండి:వార్​ 2.0.. గేర్​ మార్చిన పుతిన్.. ఇక విదేశీ ఫైటర్లతో ఉక్రెయిన్​పై దాడులు!

Last Updated : Mar 12, 2022, 5:36 AM IST

ABOUT THE AUTHOR

...view details