తెలంగాణ

telangana

ETV Bharat / international

Philippines Typhoon: ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం.. 19 మంది మృతి - ఫిలిప్పీన్స్​ తుపాను

Philippines Typhoon: ఫిలిప్పీన్స్​ను రాయ్​ తుపాను అతలాకుతలం చేసింది. పెనుగాలులతో యావత్​ దేశం మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. భారీ వర్షాల కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

Typhoon rai in Philippines
ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం

By

Published : Dec 18, 2021, 3:14 PM IST

Updated : Dec 18, 2021, 3:50 PM IST

ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం

Typhoon rai in Philippines: ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో విరుచుకుపడి దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టింది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుపాను ప్రభావం అధికంగా ఉంది.

తమ రాష్ట్రం పూర్తిగా నేలమట్టమైందని డినాగాట్​ ఐలాడ్స్​ ప్రావిన్స్​ గవర్నర్​ బగావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, తాత్కాలిక షెడ్లు, పరిశుభ్రత కిట్లు, మందులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

తుపాను ధాటికి ధ్వంసమైన ఇళ్లు

3 లక్షల మంది తరలింపు..

దక్షిణ, కేంద్ర ఫిలిప్పీన్స్​లోని రాష్ట్రాలను అతలాకుతలం చేసిన రాయ్​ తుపాను శుక్రవారం రాత్రి తీరం దాటి దక్షిణ చైనా సముద్ర వైపు కదిలిందని అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. ముందస్తు చర్యలు చేపట్టటం వల్ల చాలా ప్రాణాలను రక్షించామని చెప్పారు.

రాయ్​ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన కొద్ది సంవత్సరాలలో ఎదురైన తుపాన్లలో తీవ్రమైనదిగా పేర్కొన్నారు.

వరదలోని వ్యక్తులను కాపాడుతున్న సిబ్బంది

రెండు రోజులైనా తేలని లెక్క..

దేశంలోని ఆగ్నేయ తీరాన్ని తుపాను గత గురువారమే తాకినా.. ఇప్పటికీ మరణాలు, నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. రెండు రోజులు గడిచినా దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెల్​ఫోన్​ సిగ్నల్స్​ లేవు. 19 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఇతర వివరాలను చెప్పలేదు. మరోవైపు.. జాతీయ విపత్తు స్పందన దళం 12 మంది మృతి చెందినట్లు తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

తుపాను ధాటికి అతలాకుతలమైన ఫిలిప్పీన్స్​లోని ఓ నగరం

ఇదీ చూడండి:

'జనవరి మధ్య నాటికి 'ఒమిక్రాన్'​తో పెను విధ్వంసం!'

Last Updated : Dec 18, 2021, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details