తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ మాజీ ప్రధాని నవాజ్​కు అంబులెన్సు నిరాకరణ

దాయాది దేశం పాకిస్థాన్ ప్రభుత్వం వారి దేశ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్ పట్ల దురుసుగా ప్రవర్తించింది. షరీఫ్ కోసం అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేలా... హృద్రోగ సమస్యల అంబులెన్సును ఏర్పాటు చేయాలన్న జైళ్ల శాఖ అభ్యర్థనను ఆరోగ్య విభాగం తోసిపుచ్చింది. ప్రస్తుతం అవినీతి కేసులో షరీఫ్​ శిక్ష అనుభవిస్తున్నారు.

By

Published : Aug 24, 2019, 6:16 AM IST

Updated : Sep 28, 2019, 1:52 AM IST

పాక్ మాజీ ప్రధాని నవాజ్​కు అంబులెన్సు నిరాకరణ

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్​నకు స్వదేశంలోనే చేదు అనుభవం ఎదురైంది. షరీఫ్​కు హృద్రోగ ప్రత్యేక అంబులెన్సు సేవలను అందించేందుకురెండు ప్రభుత్వ ఆసుపత్రులు నిరాకరించాయి. గత కొంతకాలంగా లాహోర్​ జైలులో అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు షరీఫ్.

అత్యవసర సమయంలో మాజీ ప్రధానిని ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా కారాగారం వద్ద ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని పాక్ పంజాబ్​ రాష్ట్ర జైళ్ల విభాగం వారు ఆరోగ్య శాఖ అధికాలను కోరారు. జైళ్ల శాఖ వారి అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన అంబులెన్స్​లో సరైన సౌకర్యాలు లేవని అధికారులు గుర్తించారని డాన్ పత్రిక పేర్కొంది.

గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేయాలని అధికారులు కోరగా... ఈ అభ్యర్థనను ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది.

"వీఐపీలు, వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులు, రాష్ట్ర అసెంబ్లీ నేతలు, న్యాయమూర్తులు, ఆయా ప్రముఖుల కుటుంబాల సేవలో అంబులెన్సులు ఉన్నందున వైద్య బృందాలపై అధిక భారం పడుతోంది."

- పాక్ వైద్య వర్గాలు

అంబులెన్సుల కొరత ఉందని, జైళ్ల శాఖ అధికారుల అభ్యర్థన మేరకు అంబులెన్స్​ కేటాయించలేమని పంజాబ్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ కార్టియాలజీ సమాధానమిచ్చింది.

పనామా పేపర్స్ విడుదల చేసిన అవినీతి నేతల జాబితాను అనుసరించి షరీఫ్​పై దర్యాప్తు జరిగింది. 2017 జులై 28న పాక్ సుప్రీంకోర్టు... పనామా లీక్స్ ఆరోపించిన మూడు అవినీతి వ్యవహారాల్లోని ఒక దానిలో షరీఫ్​ను దోషిగా తేల్చి... ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 డిసెంబర్ 24 నుంచి ఆయన లాహోర్​లోని కోట్​ లక్​పత్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

ఇదీ చూడండి: ఎయిర్​సెల్​ కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట

Last Updated : Sep 28, 2019, 1:52 AM IST

ABOUT THE AUTHOR

...view details