జపాన్ తీరంలో ఉన్న విహార నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో.. కరోనా వైరస్‌తో ఇద్దరు మృతిచెందారు. వీరు 80ఏళ్లు పైబడిన వృద్ధులుగా ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే మృతులకు సంబంధించిన ఎలాంటి వార్తలను జపాన్ ఆరోగ్యశాఖ ధ్రువీకరించలేదు.
14రోజుల నిర్బంధం...

హాంకాంగ్‌లో దిగిన ఓ ప్రయాణికుడికి వైరస్ లక్షణాలు కనిపించినందున... మొత్తం 3,711 మందితో కూడిన ఈ నౌకను జపాన్‌లోని యోకొహోమా తీరంలోనే నిలిపివేశారు. ఇప్పటి వరకు 542 మందికి కరోనా వైరస్ సోకింది. ఇటీవలే వైరస్ సోకని ప్రయాణికులను నౌక నుంచి తరలిస్తున్నారు. దాదాపు వైరస్ సోకని 500 మంది ప్రయాణికులకు నౌక నుంచి వెళ్లేందుకు అధికారులు అనుమతినిచ్చారు.వీరందరికీ వైరస్ సోకలేదని ధ్రువపత్రాలు కూడా ఇచ్చారు.
ఇదీ చూడండి:-ఇరాన్లో మొదటి కరోనా కేసు... ఇద్దరు మృతి