చైనాలో భారీ గుమ్మడికాయలు పండిస్తున్న రైతులు భారీ గుమ్మడికాయలతో చైనా గుయీజ్హూ రాష్ట్రంలోని టాంగ్రెన్ చాలా ప్రాచుర్యం పొందింది. వాన్షాన్ గ్రామ రైతులు ఈ జంబో గుమ్మడికాయలను పండిస్తున్నారు. ప్రస్తుతం 'జియూఫెంగ్ ఆగ్రికల్చరల్ ఎక్స్పో'కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆరు జంబో గుమ్మడికాయలు ఉన్నాయి. వాటిని చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. అవి సుమారు 110 సెంటీమీటర్ల వ్యాసంతో 400 కిలోలకు పైగా బరువు కలిగి ఉన్నాయి. " ఇంత భారీ గుమ్మడికాయను మేము ఎప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారి. వాటిని చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా"
- యాంగ్ యుయేపింగ్, పర్యటకురాలు.
సాధారాణంగా మార్చి నెలలో గుమ్మడికాయ విత్తనాలు నాటుతారు. ఒక్క తీగకు ఒకే కాయ ఉంచుతారు. గుమ్మడికాయల బరువును కొలిచేందుకు వాటి కింద త్రాసులను ఏర్పాటు చేస్తారు. ఒకే రోజులో సుమారు 10 కిలోల వరకు పెరుగుతున్నట్లు గుర్తించారు. 'జియూఫెంగ్ అగ్రికల్చరల్ ఎక్స్పోజిషన్' అనే సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్హౌస్ షెడ్డులో ఈ గుమ్మడికాయలను పండిస్తోంది. వాటి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
" జియూఫెంగ్కు చాలా గ్రీన్హౌస్లు ఉన్నాయి. కానీ ఎందులోనూ గుమ్మడికాయల బరువు 400-450 కిలోల వరకు లేవు. వాన్షాన్లో మాత్రమే 400కిలోలకు పైగా బరువున్న గుమ్మడికాయలు ఉన్నాయి. గత ఏడాది 400 కిలోలకు పైగా బరువున్న గుమ్మడికాయలను పండించాం. ఈ ఏడాది 500 కిలోల వరకు పెరుగుతాయని అనుకుంటున్నాం."
- వాంగ్ జిగ్వాన్, ప్రొడక్షన్ మేనేజర్
ఇదీ చూడండి: కుక్క మాంసంపై రగడ- పోటాపోటీ నిరసనలు